తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నవరం-రావికంపాడు స్టేషన్ మధ్య శుక్రవారం రైలు ఢీకొని గుర్తు తెలియని (45) వ్యక్తి మృతి చెందాడని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ప్రకారం. మృతుడు ఎవరు అనేది తెలియ రాలేదన్నారు. ఆరంజ్ రంగు గడులు టీ షర్ట్, సిమెంట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. కుడి చేతిపై పెద్ద టాటూ ఉందన్నారు. మరిన్ని వివరాలు కొరకు జీఆర్పీ స్టేషన్లో సంప్రదించాలన్నారు.