కాకినాడ జిల్లాలోని తుని పట్టణ ఆర్టీసీ కాంప్లెక్స్ ఏడు వారాల వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రం హరినామ స్మరణతో మారుమోగింది. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాదిగా భక్తులు స్వామీ అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందారు. మరోపక్క విశేషా పర్వదినం కావడంతో స్వామివారు ఎర్రని చామంతుల మధ్య ప్రత్యేక దర్శనం ఇచ్చారు.