తుని పరిధిలో విషాధ ఘటన చోటు చేసుకుంది. తుని నుంచి దువ్వాడ ఆసుపత్రికి వెళ్లుతున్న గండి ముత్యాలమ్మ రైలులో వాంతులు చేసుకుంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆమెతో పాటు ఉన్న మనవడు గౌతమ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.