ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా చేరేలా చూడాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలపై ఉందని టీడీపీ పొలిట్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం తేటగుంటలోని టీడీపీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో యనమల రామకృష్ణుడు సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.