తునిలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

79చూసినవారు
తుని పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ ఏలూరి సుధారాణి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ చైర్ పర్సన్ తో పాటు పలు వార్డుల కౌన్సిలర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్