దుంపల్లో కందగడ్డని తినేవారు చాలా తక్కువగానే ఉంటారు. అయితే కంద తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీ, షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే కందగడ్డని తినడం ఉత్తమమట. లేత కందలు డయేరియాని తగ్గించేందుకు కూడా సహకరిస్తాయట. ఇందులో కేలరీలు తక్కువగా ఉండడంతో ఎంత తిన్నా బరువు పెరుగుతారనే భయం అవసరం లేదని చెబుతున్నారు.