బచ్చలికూర, బ్రకోలి వంటి ఆకుకూరలు తింటే మీ పిల్లల ఎముకలు బలంగా తయారవుతాయి!

59చూసినవారు
బచ్చలికూర, బ్రకోలి వంటి ఆకుకూరలు తింటే మీ పిల్లల ఎముకలు బలంగా తయారవుతాయి!
మీ పిల్లల ఎముకలు బలంగా ఉంటే వారి ఎదుగుదల బాగుంటుంది. బలమైన ఎముకలు పిల్లలను చురుకుగా ఉంచుతాయి. ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి.. ఆవాలు, బచ్చలికూర, బ్రకోలి వంటి ఆకుకూరలు దోహదం చేస్తాయి. వీటిలో కాల్షియం, విటమిన్ కెలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ కె ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తుల్లో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ఇది ఎముకల నిర్మాణానికి అవసరం. బాదంపప్పు, సోయాబీన్, సోయా చీజ్ వంటి ఆహారాలు కూడా ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందింస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్