నల్లటి ఫంగస్‌‌తో ఉండే ఉల్లిపాయలు తింటే ప్రమాదం

50చూసినవారు
నల్లటి ఫంగస్‌‌తో ఉండే ఉల్లిపాయలు తింటే ప్రమాదం
ఉల్లిపాయలను కోసే సమయంలో దానిపై నల్ల మచ్చలు ఉండడం గమనించే ఉంటారు. ఈ నల్లటి ఫంగస్‌ను ఆస్పర్‌గిల్లస్ నైగర్‌గా పిలుస్తారు. దీనిని కడగకుండా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫంగస్ గాలిలో వ్యాపిస్తే ఆస్తమా పేషెంట్లకు శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అవి తింటే తలనొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిని ఫ్రిజ్‌లో ఉంచితే మిగతా కూరగాయలకు కూడా ఈ ఫంగస్ వ్యాపిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్