దొండకాయలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దొండకాయలో ఫైబర్, విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దొండకాయ తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. ఇంకా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిలో ఉండే థయామిన్ ఎర్ర రక్త కణాల తయారీకి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.