AP: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ)లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. రూ.42.03 కోట్ల విలువైన 14 స్థిరాస్తులు, రూ.2.71 కోట్ల విలువైన ఆరు చరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇందులో ఎంవీవీ బిల్డర్స్ ఎంవీవీ సత్యనారాయణ, హయగ్రీవ మేనేజింగ్ పార్ట్‌నర్ గద్దె బ్రహ్మాజీ తదితరులకు చెందిన ఆస్తులున్నాయి.