AP: బీఈడీ కోర్సులో ప్రవేశానికి ఈ నెల 5న నిర్వహించిన ఎడ్‌సెట్ పరీక్షలకు సంబంధించి ‘కీ’ని మంగళవారం అధికారులు విడుదల చేయనున్నారు. దీనిపై అభ్యంతరాల సమర్పణకు ఈ నెల 13 వరకు గడువు ఉంది. 21న తుది ఫలితాలు విడుదల చేస్తారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 87 కేంద్రాల్లో ఎడ్‌సెట్ పరీక్షలు నిర్వహించగా.. పరీక్షకు 17,795 మంది దరఖాస్తు చేసుకున్నారు. 14,609 మంది పరీక్ష రాశారు.