ఏపీలో దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కారిడర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. బీపీసీఎల్ ఛైర్మన్, ఎండీ కృష్ణకుమార్ నేతృత్వంలోని ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను సీఎం ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. దేశానికి తూర్పు తీరంగా ఉన్న ఏపీలో గణనీయమైన పెట్రోకెమికల్ సామర్థ్యం ఉందని చంద్రబాబు అన్నారు.