గతంలో అమలైన ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ పథకాన్ని పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అమలవుతున్న ఇలాంటి పథకాన్ని అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2016లో టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కిట్‌లో దోమతెర, దుప్పటి, స్లీపింగ్ బెడ్, పౌడర్, లోషన్, న్యాప్‌కీన్, డైపర్లు ఉంటాయి. ఈ కిట్‌లను బాలింతలకు అందించేవారు.