AP: ఎన్నికలకు సంబంధించిన వివిధ పత్రాలు, సామగ్రి రోడ్డుపై కనిపించిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. ఆత్మకూరులోని ఓ వీధిలో ఎన్నికలకు ఉపయోగించే ఓటర్ స్లిప్స్, ఛాలెంజ్ ఓటర్స్ రిసిప్ట్ బుక్, అకౌంట్స్ ఆఫ్ ఓటర్ రికార్డర్ పేపర్ సీల్, రాజముద్ర, స్టాంపులు, పోలింగ్ ఏజెంట్ ఫారం 14ఎ తదితర పత్రాలు, సామగ్రి కనిపించడం స్థానికకంగా కలకలం రేపుతోంది.