ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ, 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.