ఏపీలో మరోసారి ఎన్నిక జరగనున్నాయి. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల్లో ఖాళీగా ఉన్న ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డిప్యూటీ మేయర్‌ల ఎంపిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 30లోగా ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఫిబ్రవరి 3వ తేదీన పరోక్ష పద్ధతిన ఎన్నికలు జరగనున్నాయి.