స్కూల్ విద్యార్థులపై పడిన విద్యుత్ స్తంభాలు

585చూసినవారు
స్కూల్ విద్యార్థులపై పడిన విద్యుత్ స్తంభాలు
పాఠశాల ఆవరణలో ఉంచిన విద్యుత్ స్తంభాలు విద్యార్థులపై పడ్డాయి. ఈ ఘటన కడప జిల్లా అట్లూరు మండలం పెద్దకామసముద్రంలో జరిగింది. గ్రామంలో విద్యుత్ పనుల కోసం స్తంభాలను స్కూల్ ఆవరణలో ఉంచాయి. అవి దొర్లిపడటంతో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. స్కూల్ సిబ్బంది, గుత్తేదారుడి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్