ఏనుగులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో అంతే కోపాన్ని కూడా ప్రదర్శిస్తాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఏనుగుల గుంపు పొలాల్లో తిరుగుతుండగా వాటిని తరిమికొట్టేందుకు స్థానికులు జేసీబీని రప్పించారు. అయితే, జేసీబీ డ్రైవర్ ఏనుగులను తరిమికొడుతుండగా, ఓ ఏనుగు జేసీబీపై దాడి చేసింది. జేసీబీని కింద పడేయడానికి ప్రయత్నించింది. అయితే, దాని తొండానికి కొంచెం గాయం కావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.