క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహిస్తే రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. వీరవాసరం గ్రామానికి చెందిన రావాడ కుసుమ లాంగ్ జంప్ క్రీడా విభాగం లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్రీడాకారుని కుసుమను ప్రోత్సహిస్తూ ది భీమవరం ఎల్ హెచ్ టౌన్ హాల్ తరఫున రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు అందించారు.