అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పేర్కొన్నారు. భీమవరం జెపి రోడ్‌లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం బ్రహ్మోత్సవాల ముగింపులో అన్న సమారాధన జరిగింది. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, చైర్మన్ మంతెన రామ్ కుమార్ రాజు పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు, మహానివేదన నిర్వహించారు.