పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండల వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగ మంచు కురుస్తూ ఉండడంతో రోడ్లు కనిపించక వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులకు గురయ్యారు. అలాగే తెల్లవారుజామున పొలాలకు వెళ్లే రైతులు, ట్యూషన్స్ కు వెళ్లే విద్యార్థిని విద్యార్థులు, ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే మంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉండి ఇల్లులు కూడా కనిపించకుండా ఉన్నాయి.