ఇరగవరం మండలం పేకేరు గ్రామం లో వేంచేసి ఉన్నపేకేరు గ్రామ దేవత శ్రీ నేరేళ్ళమ్మ అమ్మవారు ఆషాడమాస శుక్రవారం సందర్భంగా, భక్తులకు శాఖంభరి అవతారం లో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో,ఆలయ అర్చకులు అమ్మవారికి విశేషంగా అలంకరణలు చేసి,పూజలు నిర్వహించారు.పేకేరు, ఏలేటిపాడు, అయితంపూడి, పిట్టలవేమవరం తదితర గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకున్నారు.