పెనుగొండలోని పితాని వెంకన్న, ఎస్వీకేపీ & కెఎస్ రాజు ఆర్ట్ & సైన్స్ కళాశాలలో రూ. 2 కోట్లతో నిర్మించిన ఆదనపు తరగతుల భవనాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి శుక్రవారం ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధ్యాపకుల సమస్యలపై శంఖారావం పూరించే యుటిఎఫ్ నుండి గోపి మూర్తి పెద్దల సభకు ఎంపిక రావడం అభినందనీయమమని అన్నారు.