పెనుగొండ: బస్టాండ్ లో ప్రయాణికులు లేకున్నా వృథాగా తిరుగుతున్న ఫ్యాన్లు

82చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ- మార్టేరు రోడ్ లో కల్వర్టు నిర్మాణం, పెద్ద వంతెన మరమ్మత్తుల కారణంగా గత 20 రోజులుగా పెనుగొండ బస్సు స్టాండ్ కు బస్సులు రావడం లేదు. దీంతో బస్టాండ్ లో ప్రయాణికులు ఉండడం లేదు. అయినప్పటికీ స్థానిక పంచాయితీ అధికారులు, సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బస్టాండ్ లోని ఫ్యాన్లు రాత్రి, పగలు అనే తేడా లేకుండా 24 గంటలు తిరుగుతున్నాయని సమీపంలోని వ్యాపారులు, నివాసితులు తెలుపుతున్నారు. స్థానిక పంచాయతీ పట్టించుకోవట్లేదంటున్నారు.

సంబంధిత పోస్ట్