పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామానికి చెందిన దంగేటి గణేష్ రావు ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించారు. దీనితో తమ తండ్రి జ్ఞాపకాలు చిరకాలం ఉండిపోవాలని సంకల్పించిన గణేష్ రావు కుమారులు వెంకట సత్యనారాయణ, రాంబాబు తమ బాబాయ్ శ్రీనివాస్ తో కలిసి 300మామిడి మొక్కలు గ్రామస్థులకు, బంధువులకు శనివారం పంచిపెట్టారు. తండ్రి జ్ఞాపకార్ధం వీరు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సన్నిహితులు, ప్రకృతి ప్రేమికులు అభినందిస్తున్నారు.