పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలోని స్థానిక శివరావుపేటలోని అంగన్వాడీ కేంద్రం వద్ద విలేజ్ హెల్త్ శానిటేషన్, న్యూట్రీషన్ డే కార్యక్రమాన్నిశుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పౌష్టికారంలోని పోషక విలువల గురించి, పిల్లలలో పోషకాహార లోపం పై తల్లి, తండ్రులు ద్రుష్టి పెట్టాల్సిన ఆవశ్యకత గురించి సీడిపీఓ కృష్ణ కుమారి లబ్ధిదారులకు వివరించారు.