జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1వ తేది వరకు నంద్యాలలో నిర్వహించిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్‌లో పెనుమంట్ర మండలం మార్టేరు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించారు. ఈ సంధర్బంగా సోమవారం కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని శ్రీనివాస్ అన్నారు.