వడలిలో రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన మహిళ

50చూసినవారు
వడలిలో రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన మహిళ
పెనుగొండ మండలం వడలి గ్రామంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక గౌడ రామాలయం వద్ద వ్యానులో ఆయుర్వేద మందులు అమ్ముకుంటున్న వ్యాన్ ను కడియపులంకకు చెందిన వ్యాన్ ఢీ కొట్టడంతో ఆయుర్వేద మందులు అమ్ముతున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడున్న స్థానికులు ఆమెను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి వ్యాన్ లో ఆయుర్వేద మందులు అమ్ముతున్నారు.

సంబంధిత పోస్ట్