వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బుద్ధప్రసాద్

68చూసినవారు
వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బుద్ధప్రసాద్
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సమేతంగా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం దర్శించుకున్నారు. సోమవారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వారికి దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికి పూజల అనంతరం వేద మంత్రోచ్చారణలతో ఘనంగా ఆశీస్సులు అందించి సత్కరించి ప్రసాదం, చిత్రపటాలు బహుకరించారు. కార్యక్రమంలో బుద్ధప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.