తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నికైన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు కైతేపల్లి దాస్ కు ఆదివారం సాయంత్రం చల్లపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన సన్మానం జరిగింది. ప్రజాసంఘాల నేతలు, దళితసంఘాల నేతలు పాల్గొని దాస్ మాస్టారును సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రముకులు అడ్డాడ ప్రసాద్బాబు, దాసి సీతారామరాజు, అడపా గురవయ్య, బుల్లా కిషోర్, ఉప్పాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.