భీమవరం: అన్నిదానాల కెల్లా అన్నదానం ఎంతో గొప్పది

82చూసినవారు
భీమవరం: అన్నిదానాల కెల్లా అన్నదానం ఎంతో గొప్పది
అన్నిదానాల్లో కెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, భగవంతుని కార్యక్రమాల్లో అన్న సమారాధనలు నిర్వహించడం భగవంతుడు మెచ్చే పుణ్య కార్యక్రమమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం జేపీ రోడ్డులోని శ్రీపద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక కల్యాణ బ్రహ్మాత్సవాలు ముగింపులో భాగంగా శనివారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్