ప. గో. జిల్లాలో 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలను తప్పక ఇప్పించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఫిబ్రవరి 10న నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవంపై వివిధ శాఖల అధికారులతో కన్వర్జెన్సీ నిర్వహించి పలు సూచనలను జారీ చేశారు. నిర్దేశించిన సమయానికి ఆల్బెండజోల్ ఇవ్వాలన్నారు.