భీమవరం శాసనసభ్యులు పులవర్తి అంజి బాబుని మంగళవారం వైసీపీ, సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఎంసీపీఐ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ అన్ని నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో వుండే విధంగా గతంలో సేకరించిన 21 ఎకరాల మార్కెట్ యార్డ్ భూమిలోనే నిర్మించాలని కోరారు.