మద్యపాన రహిత సమాజం ప్రభుత్వ ధ్యేయమని భీమవరం ఎక్సైజ్ సీఐ కే. బలరామరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం నానాజీ ఎంటర్ప్రైజెస్ ముఠా కూలీలతో మద్యపాన వ్యసనం జీవితం నాశనం అనే నినాదంతో ఎక్సైజ్ డిఎస్పీ కుమారన్ ఆదేశాల అవగాహన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ బలరామరాజు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.