భీమవరం వన్ టౌన్‌కి చెందిన బాలిక ఈనెల 2న ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికి అనంతరం 3న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వన్ టౌన్ ఎస్ఐ కిరణ్ మొబైల్ సిగ్నల్ ఆధారంగా పాలకోడేరు మండలం గరగపర్రులో స్మశానం దగ్గర గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో శనివారం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గంటల వ్యవధిలో బాలికను పట్టుకోవడంతో సిబ్బందిని అభినందించారు.