యువత క్రీడల్లో రాణించి జిల్లాకు కీర్తి ప్రతిష్టతలు తీసుకురావాలని ప. గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జనవరి 27 నుంచి 30 వరకు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో నిర్వహించిన ఎస్‌బికెఎఫ్ 11వ జాతీయ ఆటల పోటీలలో షటిల్, బ్యాడ్మింటన్ విభాగంలో భీమవరం మండలం గూట్లపాడుకి చెందిన రామాయణం దుర్గారావు గోల్డ్, కాంస్య మెడల్స్‌ను సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఛాంబర్‌లో బుధవారం ఆయనను అభినందించారు.