ఈనెల 13 నుంచి జరగనున్న భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిద డిపార్ట్మెంట్ అధికారులు, నీరుల్లి, కూరగాయ, పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు