భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో టీడీపీ నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉగ్రవాదుల దాడుల్లో అమరులైన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.