ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు ఎంపిక చేసుకున్న మిల్లులో ధాన్యాన్ని అమ్మడానికి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప గో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. భీమవరం కలెక్టరేట్లో జేసీ ఛాంబర్లో జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సభ్యులతో ధాన్యం కొనుగోలుపై జేసీ మంగళవారం సమీక్షించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు.