పశ్చిమగోదావరి జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 97. 4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా కాళ్ల మండలంలో 28. 2, ఆకివీడు 24. 2, ఉండి 19. 8, ఇరగవరం 10. 0, తాడేపల్లిగూడెం 3. 2, పెనుగొండ 2. 4, వీరవాసరం 2. 2 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. జిల్లాలో సరాసరి 4. 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వెల్లడించారు.