ఎస్సీ కుల గణనపై జనవరి 7 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ప. గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ అర్జీలు ఆన్లైన్ చేయడం, మార్పులు, చేర్పులు వివరాల వెరిఫికేషన్ గడువు జనవరి 11 వరకూ పెంచామన్నారు. జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో జనవరి 17న ప్రకటిస్తామన్నారు. అలాగే డేటాపై అభ్యంతరాలను వీఆర్వో స్వీకరిస్తారని వాటిని మూడు దశల్లో తనిఖీ చేస్తారని అన్నారు.