భీమవరంకి చెందిన సత్యం హోమియో కేర్ వైద్యులు చిక్కం సత్యసంజీవ్ టైమ్స్ ఐకాన్స్ ఆఫ్ ది హెల్త్ కేర్ -2024 అవార్డును అందుకోవడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శుక్రవారం ఆయనను అభినందించి అవార్డు అందజేశారు. హోమియోపతిలో అనుసరిస్తున్న వైద్య విధానాలు చేస్తున్న సేవలకు గాను ఈ అవార్డు అందించారని, హోమియో ద్వారా రోగులకు మరిన్ని వైద్య సేవలను సమర్థంగా అందించాలన్నారు