భీమవరం నియోజకవర్గం లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో మన భారత సాయుధ దళాల విరోచిత పోరు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని వారికి ధన్యవాదాలు తెలుపుతూ శనివారం విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా అధ్యక్షులు మంతెన రాంబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.