సొసైటీకి ఉపయోగపడే విధంగా ఇంజనీర్లుగా తయారై మంచి పరిశ్రమలు స్థాపించి, దేశానికి ఆదర్శంగా నిలవాలని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఇన్ చార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కెవిఎస్ జి. మురళీకృష్ణ కాబోయే ఇంజనీర్లకు సూచించారు. భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బుధవారం నిర్వహించిన ఓరియంటేషన్ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.