పేదలకు ఉపయోగపడే సైన్స్ ను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ బి. గోపి మూర్తి అన్నారు. సౌత్ ఇండియా సైన్స్ ఫెస్ట్ 2024-25 లో భాగంగా వీరవాసరం ఎంఆర్‌కె జిల్లా పరిషత్ హైస్కూల్ నందు శనివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైన్స్‌ను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.