చింతలపూడి మండలంలో పర్యటనలో భాగంగా బుధవారం జిల్లా వెట్రి సెల్వి స్థానిక గాంధీనగర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడ గర్భిణీలకు, బాలింతలు, పిల్లలకు బాలామృతం ప్యాకెట్లను కలెక్టర్ అందజేశారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో కలెక్టర్ కాసేపు ముచ్చటించి వారికి అందిస్తున్న పౌష్టికాహారం ఆహారం వివరాలను తెలుసుకొని పిల్లలతో కలిసి ఆహారాన్ని తీసుకున్నారు.