జంగారెడ్డిగూడెంలోని ఎస్డిఎస్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు బుధవారం టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. విద్యార్థులు ఒక ఉన్నత స్థానానికి ఎదగాలంటే నేర్చుకోవాలనే తపనతో పాటు ఏకాగ్రత, క్రమశిక్షణ అవసరమని అన్నారు. ఉన్నత ఆశయం కలిగి ఉంటే డాక్టర్లు, ఇంజనీర్లు, వైద్యులు, రాజకీయవేత్తలుగా ఎదగవచ్చన్నారు.