రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో ముస్లింలు ఈద్‌గా వద్ద ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు. వైసీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు నమాజ్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదిన విశిష్టతను ముస్లిం మత పెద్దలు వివరించారు.