ఏలూరు జిల్లా లింగంపాలెం మండలంలో రేషన్ బియ్యం లోడుతో ప్రయాణిస్తున్న మినీ వ్యాన్ గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. అన్నపనేనివారిగూడెంలో అక్రమ రేషన్ బియ్యం లోడు చేసుకొని వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే వాహనం చింతలపూడి, లింగంపాలెం మండలాల్లో మూడుసార్లు ప్రమాదానికి గురైనట్లు పలువురు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.