జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం తెల్లవారుజాము నుండి ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లే చిన్నారులు మరియు ప్రజలకు ఆటంకం ఏర్పడింది. అలాగే వర్షం రాకతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. అదేవిధంగా పలుచోట్ల రహదారులు అద్వానంగా మారడంతో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.